తగుళ్ళ గోపాల్‌ ఈ ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ‘దండకడియం’ కవితా సంపుటిని అవార్డు కమిటీ ఎం పిక చేసింది. న్యాయనిర్ణేతలుగా జి.వెంకట కృష్ణ, పలమనేరు బాలాజీ, కె.నాగే శ్వరాచారి వ్యవహరించారు. త్వరలో అనంతపురంలో జరిగే ప్రత్యేకసభలో విజేతకు పురస్కార ప్రదానం ఉంటుంది.

కొత్తపల్లి సురేష్‌