పుట్ల హేమలత పురస్కారాలు

 2022 సంవత్సరానికి కథా రచయిత్రి ఎండపల్లి భారతి; యువ రచయిత్రి, అనువా దకురాలు షఫేలా ఫ్రాంకిన్సెన్స్‌లకు ‘డా. పుట్ల హేమలత స్మారక పురస్కారం’ ఈ నెల 26న ఆమె 60వ జయంతి సందర్భంగా అందిస్తున్నారు. 

ఎండ్లూరి మానస

రాయలసీమ పద్యపోటీలు

రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంగా పద్యపోటీలను ‘వేమన అధ్య యన ్క్ష అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో ఆశావాది ప్రకాశరావు స్మారకార్థం నిర్వ హిస్తున్నాం. ఐదు పద్యాలను మార్చి 25లోపు 9962544299కి వాట్సప్‌ చేయాలి. వివరాలకు: 99639 17187.

అప్పిరెడ్డి హరినాథరెడ్డి
 

సహృదయ సాహితీ పురస్కారం

ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా ఏర్పాటైన ‘సహృదయ సాహితీ పుర స్కారం’ 2020 సంవత్సరానికిగాను బూదాటి వేంకటేశ్వర్లు ‘ఆనంద కందళి’ సాహితీ విమర్శ గ్రంథానికి లభించింది. త్వరలో సంస్థ రజతోత్సవంలో పుర స్కార ప్రదానం జరుగుతుంది. 

గన్నమరాజు గిరిజామనోహరబాబు
 

బాపురం గురురాజరావు పురస్కారం

సృజన సాహిత్య సంగమం ఆధ్వర్యంలో బాపురం గురురాజరావు స్మారక కవితా పురస్కారం కోసం 2021లో ముద్రిత మైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తు న్నాం. బహుమతి పొందిన కవితా సం పుటానికి రూ.7,500 నగదు పురస్కారం ఉంటుంది. కవితా సంపుటాలు నాలుగు ప్రతులను ఏప్రిల్‌ 20లోగా, చిరునామా: కె.వి.మేఘనాథ్‌రెడ్డి, డోర్‌.నెం. 11/21/01, ఎన్‌.జి.ఓస్‌ కాలనీ, పుత్తూరు-517583కు పంపాలి. ఫోన్‌: 63003 18230.

బాపురం నరహరిరావు
 

వాసా ప్రభావతి కవితల పోటీ

పాలపిట్ట-వాసా ఫౌండేషన్‌ సంయుక్తంగా డా.వాసా ప్రభావతి స్మారక కవితల పోటీకి స్త్రీ సంవేదనలపై కవితలకు ప్రా ధాన్యం ఉంటుంది. మొదటి, రెండవ, మూడవ బహుమతులు: రూ.3వేలు, 2వేలు, ఒక వెయ్యి. 8 కవితలకు రూ.500 చొప్పున ప్రత్యేక బహుమతులు. కవితలను మార్చి 30లోగా, చిరునామా: పాలపిట్ట, ఫ్లాట్‌ నెం-2, బ్లాక్‌-6, ఎంఐజి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044కు పంపాలి. వివరాలకు: 9490099327.

గుడిపాటి
 

వచన కవితల పోటీ 

ఫలితాలుకవిసంధ్య-ద్వానాశాస్త్రి స్మారక వచన కవితల పోటీ ఫలితాలు: మొదటి బహుమతి: రవిచంద్ర (‘బీరపాదు’), రెండో బహుమతి: తుమ్మలదేవ్‌రావ్‌ (‘ఒక పాదమైపోరాద’), మూడో బహుమతి: రాంభక్త పద్మావతి (‘పూలనవ్వుల కోసం’). ప్రోత్సాహక బహుమ తులు: బెల్లి యాదయ్య, బి.వి.శివప్రసాద్‌, ఆవాల శారద, దాసరి మోహన్‌, లండ సాంబ మూర్తి, కె.జె.రావు, వి.కృష్ణ ప్రగడ, బి.కళాగోపాల్‌, అచ్చుల, చొక్కాపు లక్ష్మనాయుడు. మార్చి 20న యానాం ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజ్‌లో అవార్డు ప్రదానం ఉంటుంది. 

దాట్ల దేవదానం రాజు