కథల పోటీ

వాసాప్రభావతి స్మారక కథల పోటీకి ప్రస్తుత సమాజ స్థితిని ప్రతిబింబిచే కథలను పంపాలి. మొదటి, రెండవ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.2500, ప్రత్యేక బహుమతి ఐదు కథలకు రూ.1000. కథలను ఏప్రిల్‌ 30 లోగా చిరునామా: సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌- 500102, ఫోన్‌:9490751681కు పంపాలి.

పొత్తూరి సుబ్బారావు

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం

2021 సంవత్సరానికి ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారా’న్ని ‘దండకడియం’ కవితా సంపుటికి గాను తగుళ్ళ గోపాల్‌ స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ మార్చి 20 ఉ.10.30గం.లకు రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌, కరీంనగర్‌ రోడ్‌, సిరిసిల్లలో జరుగుతుంది. సభలో తంగెడ కిషన్‌రావు, జూకంటి జగన్నాథం, జిందం కళాచక్రపాణి, బెల్లి యాదయ్య, రంగినేని మోహన్‌ రావు పాల్గొంటారు.

మద్దికుంట లక్ష్మణ్‌

‘జవాబు కావాలి’ కవిత్వ సంపుటి

సలీమ కవిత్వ సంపుటి ‘జవాబు కావాలి’ ఆవిష్కరణ సభ మార్చి 16 సా.5గం.లకు షోయబ్‌హాల్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో జూలూరి గౌరీశంకర్‌, ఎస్‌.కె. మస్తాన్‌బి, శిలాలోలిత, గుడిపాటి, కె. ఆనందాచారి, అయినంపూడి శ్రీలక్ష్మి, మెర్సీ మార్గరెట్‌ జరీనా బేగం, నస్రీన్‌ ఖాన్‌ పాల్గొంటారు.

తెలంగాణ సాహితి

సాహిత్య సమాలోచన సదస్సు

జానుడి - సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో సాగర్‌ శ్రీరామకవచం సాహిత్య సమా లోచన సదస్సు మార్చి 20 ఉ.9గం.ల నుంచి మల్లవరపు రాజేశ్వరరావు భవన్‌, ఒంగోలులో జరుగు తుంది. సభలో చిన్ని నారాయణరావు, సయ్యద్‌ సలీం, వెన్నెలకంటి రామారావు, బొల్లోజు బాబా, బా రహం తుల్లా, దగ్గుమాటి పద్మాకర్‌ తదితరులు పాల్గొంటారు.

నూకతోటి రవికుమార్‌

‘దిక్చక్రం’ సాహిత్య వ్యాసాల సంపుటి

ఆడెపు లక్ష్మీపతి సాహిత్య వ్యాసాల సంపుటి ఆవిష్కరణ సభ మార్చి 19 సా.6గం.లకు కాన్ఫరెన్స్‌ హాల్‌, రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో నిఖిలేశ్వర్‌, కె.శివారెడ్డి, జూలూరు గౌరీశంకర్‌, మామిడి హరికృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, థింసా, వాసిరెడ్డి నవీన్‌ తదితరులు పాల్గొంటారు.

ఆదిత్య (లిటరరీ) పబ్లికేషన్స్‌

యానాంలో ప్రపంచ కవితా దినోత్సవం

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవి సంధ్య-తెలుగు శాఖ, డా.ఎస్‌ఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యానాం సయుక్త నిర్వహణలో మార్చి 20 ఉ.10గం.ల నుంచి జూమ్‌ వేదికగా ‘యానాం ప్రపంచ కవితా దినోత్సవం’ నిర్వహిస్తున్నాం. ఈ సందర్బంగా కవిత్వంపై ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, గ్రంథావిష్కరణలు, కవి సంధ్య-ద్వానా శాస్త్రి కవితల పోటీ బహుమతుల ప్రదానం ఉంటాయి. కార్యక్రమంలో కె.శివారెడ్డి, పాపినేని శివశంకర్‌, జి. లక్ష్మీన రసయ్య, అఫ్సర్‌, ప్రసాద మూర్తి, దర్భశయనం శ్రీనివాసా చార్య, బొల్లోజు బాబా, పుప్పాల శ్రీరాంలు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.

 

శిఖామణి