‘మయూఖ’ వచన కవితల పోటీ
‘మయూఖ’ ఆన్‌లైన్‌ మాగజైన్‌, కవితా వేదిక, కెనెడా సంయుక్తంగా నిర్వహిస్తున్న వచన కవితల పోటీకి 40పాదాలకు మించని కవితలను యూనికోడ్‌లో టైప్‌ చేసి ఏప్రిల్‌ 7 లోగా ఈమెయిల్స్‌: [email protected], [email protected]కు పంపాలి. విజేతలకు వరుసగా రూ.3000, 2000, 1000, మూడు కన్సోలేషన్‌ బహుమతులు రూ.500 చొప్పున ఇస్తాం. 20 కవితలను సాధారణ ప్రచురణకు తీసుకుంటాం.
 
కొండపల్లి నీహారిణి
‘పదబంధం’ దేశదేశాల కవిత్వ కరచాలనం నారాయణస్వామి వెంకటయోగి పుస్తకం ‘పదబంధం’ ఆవిష్కరణ సభ మార్చి 28 సా.6గం.లకు హైదరాబాద్‌, రవీంద్రభారతిలో జరుగుతుంది. సభలో నందిని సిధారెడ్డి, రమామెల్కొటే, కె. శివారెడ్డి, జూలూరి గౌరీశంకర్‌, ఎన్‌. వేణుగోపాల్‌, సుధాకిరణ్‌, గోరటి వెంకన్న తదితరులు పాల్గొంటారు.
 
కవిసంగమం
 
కవిసంధ్య ఉగాది కవి సమ్మేళనం
శుభకృత్‌ నామ ఉగాదిని పురస్కరించుకొని కవి సంధ్య, యానాం ఆధ్వర్యంలో జూమ్‌ వేదికగా కవి సమ్మేళనం జరుగుతుంది. ఏప్రిల్‌ 2 సాయంత్రం 5.30 నుంచి కవులు తమకు నచ్చిన సామాజిక అంశంపై కవితలు చదవవచ్చు. పేర్లను 9848202526వాట్సాప్‌ నంబరులో నమోదు చేసుకోవాలి.
 
దాట్ల దేవదానం రాజు
 
‘బతుకుపుస్తకం’ అభినందన సంచిక

దేవులపల్లి కృష్ణమూర్తి గారికి 82ఏళ్లు నిండిన సందర్భంగా జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ‘బతుకుపుస్తకం’ అభినందన సంచికను అంతర్జాల వేదికలో మార్చి 28 సాయంత్రం 6.30 ని.లకు ఆవిష్కరిస్తుంది. సభలో జి.చెన్నకేశవరెడ్డి, అమ్మంగి వేణుగోపాల్‌, ఏనుగు నరసింహారెడ్డి, పిల్లలమర్రి రాములు తదితరులు పాల్గొంటారు. వివరాలకు ఫోన్‌: 9441046839

రాయారావు సూర్యప్రకాశ్‌ రావు
 
అభినందన సభ
అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కువెంపు జాతీయ పురస్కారం పొందిన సందర్భంగా పి.సత్యవతిగారికి అభినందన సభ ఏప్రిల్‌ 3 సా.6.30కు శిఖర స్కూల్‌, ప్రజాశక్తి నగర్‌, విజయవాడలో జరుగుతుంది. ఓల్గా, పాపినేని శివశంకర్‌, వాసిరెడ్డి నవీన్‌, చంద్రలత, భార్గవి, ప్రతిమ, అన్వర్‌ తదితరులు పాల్గొంటారు. 
 
సాహితీ మిత్రులు