రవీంద్రభారతి, అక్టోబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు సాహిత్యం సాధనం లాంటిదని ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ట్ర్‌స్ట అధినేత్రి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. రచయిత్రి కసుపర్తి వరలక్ష్మమ్మ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో ఆకాంక్ష చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన రచయిత్రి ముక్తేవిభారతికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీపార్వతి పురస్కారగ్రహీతను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముక్తేవిభారతి సామాజిక నేపథ్యమైన అంశాలపై రచనలు చేశారని అన్నారు. కసుపర్తి వరలక్ష్మమ్మ పేరిట పురస్కారాన్ని అందజేయడం సముచితమైన నిర్ణయమని అన్నారు. ఈ తరం రచయితలు సమాజానికి అవసరమయ్యే సాహిత్యాన్ని రచించాలని సూచించారు. కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, రాజ్యలక్ష్మి, రఘుశ్రీ పాల్గొని ముక్తేవి భారతిని సత్కరించి అభినందించారు.