హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: ప్రముఖ రంగస్థల, టీవీ నటులు, నాటక ప్రయోక్త ఎంవీ రామారా వు 6వ పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల దర్శకులు, నటులు శ్రీపాద కుమారశర్మకు ప్రదానం చేశారు. శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం త్యాగరాయగానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వీసీ కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ శ్రీపాదశర్మ నటుడిగా, ప్రయోక్తగా ఎంతో పేరు గాంచారన్నారు. ప్రముఖ రచయిత్రి, శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి కె.వాసవదత్త రమణ రచించిన అంతరాలు తెలుగు కథా సంకలనాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కవి డాక్టర్‌ జె.బాపురెడ్డి, ప్రముఖ సినీనటుడు విద్యాసాగర్‌, ప్రొఫెసర్‌ కోన హేమచంద్‌, సత్యప్రసాద్‌, డాక్టర్‌ కళా దీక్షితులు పాల్గొన్నారు.