అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతిని ప్రభుత్వం నియమించింది. బుధవారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ ఆ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.