గుంటూరు(సాంస్కృతికం), జనవరి 24: ఆచార్య ఎన్‌జీ రంగా సాహితీ పురస్కారం పేరుతో జాతీయ స్థాయిలో తెలుగు కథల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సాహితీవేత్త, నిర్వాహకులు డాక్టర్‌ జక్కంపూడి సీతారామారావు తెలిపారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కథ ఇతివృత్తం ఆధునిక సమాజానికి సంబంధించినదై ఉండాలని, ఏ4 సైజులో డీటీపీ చేసి 15- 20 పేజీలు మించకుండా ఉండాలన్నారు. ఉత్తమ కథకు రూ. 10వేలు నగదు పురస్కారం ఇవ్వనున్నట్టు తెలిపారు. కథను డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ 202 శ్రీ వెంకట సాయి రెసిడెన్సీ, 2వ లైను రామయ్యనగర్‌, ఒంగోలు, ప్రకాశం జిల్లా(సెల్‌ 9849799711)కు పంపాలని, ఇతర వివరాలకు డాక్టర్‌ వెన్నిసెట్టి సింగారావు సెల్‌ 9393015584, డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు సెల్‌ 9848351517లో సంప్రతించాలన్నారు.