నాగభైరవ సాహిత్య పీఠం, ఒంగోలు నిర్వహించిన నవలల పోటీ 2020లో ప్రథమ బహుమతికి ‘ఎడారిపూలు’ (సలీం), ద్వితీయ బహుమతికి ‘కోటిన్నొక్కడు’ (చేతన వంశీ) నవలలు ఎంపిక య్యాయి. పరిశోధనల పోటీ 2021లో ప్రథమబహుమతికి ‘గాథాసప్తశతి-సౌందర్య గాథ’ (అనుపాటి సుబ్బారాయుడు), ద్వితీయ బహుమతికి ‘దీర్ఘ కవితా వికాసం’ (పెళ్ళూరు సునీల్‌) రచనలు ఎంపిక య్యాయి. నాటక పురస్కారాన్ని జరుగుల రామారావు, ఆత్మీయ పురస్కారాన్ని చిన్ని నారాయణరావు స్వీకరిస్తారు. అవార్డు ప్రధానం ఆగస్టు 15 న ఒంగోలులోని నాగభైరవ అకాడమీలో జరుగుతుంది.

నాగభైరవ ఆదినారాయణ