రాజేంద్రనగర్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగ ర్‌ సర్కిల్‌ బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన కవయిత్రి, రచయిత్రి కందూరి సుజాతరాణికి మెదక్‌ జిల్లా వనదుర్గా క్షేత్రంలోని మల్లినాథసూరి కళాపీఠం కవి చక్రవర్తి బిరుదును ప్రదానం చేశారు. సుజాతరాణి మల్లినాథసూరి కళాపీఠం తరఫున రంగారెడ్డిజిల్లా అడ్మిన్‌గా కూడా బాధ్యతలు స్వీకరించారు. 105 కవితలు ఏకధాటిగా రచించడం వల్ల ఆమెకు ఈ బిరుదును ప్రదానం చేశారు. మహిళాసాధికారత, జనచైతన్యం, దైవపాదం, జాగృతి, ప్రస్తుత పరిస్థితులు అనే రచనలు కూడా చేశారు. గతంలో ఆమెకు స్ఫూర్తిరత్న, రాజశ్రీ బిరుదు లు కూడా వచ్చాయి. లీడ్‌ వరల్డ్‌, ఉదయసాహితీ, గిడుగు రామమూర్తి పురస్కారాలు లభించాయి.