ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు 
2021 సంవత్సరానికి ‘పచ్చికడుపు వాసన’ కవితా సంపుటికి గాను యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీకరిస్తారు. యం. పార్వతి సాహితీ పురస్కారాన్ని తుర్లపాటి రాజేశ్వరి, ఆర్‌. వసుధారాణి స్వీకరిస్తారు. అవార్డు ప్రదాన సభ మే 15 ఉ.10గం.లకు ఎన్‌.జి.ఓ. హోమ్‌, అనంతపురంలో ఉంటుంది.   
 
ఉమ్మడిశెట్టి రాధే
 
బాల గేయ సంకలనాల ప్రచురణ
‘ఆజాదీకా అమృత మహోత్సవ్‌’ సందర్భంగా తెస్తున్న రెండు ‘తెలుగు బాల గేయాలు’ సంకలనాలకోసం మీరు రాసిన, మీకు నచ్చిన బాల గేయాలు జూన్‌ 1 లోగా చిరునామా: గరిపల్లి అశోక్‌, 404, వి.ఎల్‌.ఆర్‌. రెసిడెన్సీ, శ్రీనివాస్‌ నగర్‌, సిద్దిపేట-502103కు పంపాలి. ఫోన్‌: 98496 49101. 

పత్తిపాక మోహన్‌
 
నాగభైరవ సాహితీ పురస్కారం
‘నాగభైరవ సాహితీ పురస్కారం 2022’ కోసం 2018 నుంచి 2021 మధ్య ప్రచురితమైన  సాహిత్య వ్యాస సంపుటాలు 4 ప్రతులను జూన్‌ 10లోపు చిరునామా: నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీవెంకటసాయి రెసిడెన్సీ, 2వ లైను, రామయ్యనగర్‌, ఒంగోలు-523002, ఆం.ప్రకు పంపాలి. వివరాలకు: 9849799711. ప్రథమ బహుమతి రూ.10వేలు. 
 
నాగభైరవ ఆదినారాయణ