చిక్కడపల్లి, అక్టోబర్‌ 18(ఆంధ్రజ్యోతి): లలిత, సినీ గీతాల విశ్లేషకుడు, సంగీత దర్శకుడు, నటుడు వీఎల్‌ఎన్‌ చారియర్‌కు ఘన సత్కారం నిర్వహించారు. మధు మ్యూజిక్‌ అకాడమీ 23వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం త్యాగరాయ గానసభలో ఘనంగా జరిగింది. కార్యక్రమా నికి అతిథిగా పాల్గొన్న మెదక్‌ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌, కళాభిమాని ఎంఎల్‌ కాంతారావు మాట్లాడుతూ చారియర్‌ పలు నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్నారన్నారు. ఈ సందర్భంగా చారియర్‌కు రాగ విద్వన్మణి బిరుదును ప్రదానం చేశారు. సంస్థ కార్యదర్శి మధుసూదనరావు, సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్‌, సురేఖామూర్తి, వైఎస్‌ రామకృష్ణ, రమణ పాల్గొన్నారు.