హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: రవీంద్రభారతిలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో మహానటుడు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వర్‌రావు దివ్యస్మృత్యర్థం సందర్భంగా రసమయి రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల నిపుణుడు మొదలి నాగభూషణశర్మ, ఆకెళ్ల, ఎన్‌.జె.భిక్షు, గౌతమ్‌రాజు, ప్రతాప్‌గౌడ్‌, వల్లూరు శ్రీహరిరావు, రాధాప్రశాంతి, రాగిని, అప్సర కృష్ణ తదితరులకు రంగస్థల పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రోశయ్య పురస్కార గ్రహీతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సారిపల్లి కొండల్‌రావు, ఎం.నర్సింహప్ప, ఎన్‌కే.రాము, ఎన్‌కే.ఆశలత పాల్గొన్నారు.