గచ్చిబౌలి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాయప్రోలు శ్రీనివాస్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ యూనివర్సిటీ ఇంగ్లి్‌ష శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన యువరచయితల అవార్డుకు బెంగళూరుకు చెందిన ప్రశాంత్‌ పర్వతనేని ఎంపికయ్యారు. గతనెలలో దేశవ్యాప్తంగా ఉన్న యువరచయితల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఈ ట్రస్టు ఓ కమిటీ వేసి ఉత్తమ రచయితను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 170మంది యువ రచయితలు, 20సంవత్సరాల నుంచి 40సంవత్సరాలోపు ఉన్న రచయితలు ఈ పోటీలకు అర్హులుగా నిర్వాహకులు ప్రకటించారు. 2009నుంచి ప్రతి ఏటా యువ రచయుతలను గుర్తించి అవార్డు, జ్ఞాపికను అందజేస్తున్నారు. ఈ వార్డు కింద రూ.15వేలు, జ్ఞాపికను అందజేయనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.