వందనం వందనం

మరో సారి వందనం 

ప్రేమ సహనం విశాలహృదయం
ధైర్యం స్థైర్యం సాహసగుణములు 
ఒకటై వస్తే వచ్చి నిలిస్తే
ఆ పదమే స్త్రీ... మన సంపదయే స్త్రీ..
 
ప్రపంచానికే ఉనికీ మనికీ
తానే తానే మాటలేమిటికి
కరోనా పుట్టుకనే కనిపెట్టెను తొలుత
షీజెంగ్లీ కాదా మనపాలిటి దేవత
 
ఆ వైరస్ వ్యాప్తినే గమనించెను ఒక  కాంత
కె.కె. శైలజ కాదా మన జీవన విధాత 
కరోనా టెస్టు కిట్ తయారీ ఘనత
మీనాల్ దాఖలే భోంస్లే కృషిఫలితమె కనగా
జెన్నీఫర్ హాలెర్ దే త్యాగశీల చరిత
టెస్టుడోసు కోసమని సిద్ధపడెను తనుగా
ఇంటిలోన గృహిణులు వీథుల్లో నర్శులూ
టీచర్లూ డాక్టక్లూ పారిశుద్ధ్యకార్మికలూ
ఒకరుకాదు వందలు కాదు వేలల్లో వేలు
సేవల్లో ముందున్నారు - ఆ స్త్రీలకు జేజేలు
 
డా. అద్దంకి శ్రీనివాస్