తానా - మంచి పుస్తకం సంయుక్తంగా బాల సాహిత్యాన్ని ప్రోత్స హించడం కోసం పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల కథలు - 2021కి రచనలను ఆహ్వానిస్తోంది. పుస్తకం ఇన్నర్‌ టైటిల్‌, ఇన్‌ప్రింట్‌ పేజీతో సహా 24 పేజీలు ఉండాలి. ఒక్కొక్క పేజీలో 10 - 12 వాక్యాలకు మించి ఉండకూడదు. నీతి బోధే కథ ప్రధాన ఉద్దేశంగా ఉండకూ డదు. కథ, బొమ్మలు ఒకరే రాయ/ గీయవచ్చు. లేదా బృందంగా పనిచేయవచ్చు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. దశ-1: కథ సారాంశం, నమూనా బొమ్మలు మాకు నవంబర్‌ 30 లోపు అందజె య్యాలి. ఈ దశలో ఎంపికైనవి రెండవ దశలోకి వెళ్తాయి. దశ-2: ఈ దశకి సుమారు 10 కథాంశాలని ఎంపిక చేస్తాం. కథ రాసినవారికి, బొమ్మలు వేసినవారికి పదివేల రూపాయల చొప్పున పారితోషికం అందజేస్తాం. 2021 మార్చి 31 లోపల బొమ్మలతో పూర్తిచేసి, ముద్ర ణకు సిద్ధంగా ఉన్న పుస్తకాన్ని అంద జెయ్యాలి. ఈ పుస్తకాలన్నింటినీ తానా - మంచి పుస్తకం కలిసి 2021 జులై నాటికి ప్రచురిస్తాయి. రచనలు పంపాల్సిన చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీధి నెం.1, తార్నాక, సికింద్రాబాదు 500017, ఈమెయిల్‌: జీుఽజౌఃఝ్చుఽఛిజిజీ ఞఠట్ట్చజ్చుఝ.జీుఽ. కె.సురేష్‌-9963862926, వాసిరెడ్డి నవీన్‌-9849310560. 

 

వాసిరెడ్డి నవీన్‌
 
 

‘అనిమేష’ కావ్యం ఆవిష్కరణ
 

నందిని సిధారెడ్డి ‘అనిమేష’ కావ్యం ఆవిష్కరణ 5 అక్టోబర్‌ సా.4.30 ని.లకు ప్రెస్‌ క్లబ్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఏలూరి రఘు, నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొంటారు.

 


తెలంగాణ రచయితల సంఘం
 
 
 
సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌ 2021
 
సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భారతీయ భాషల నుండి యువ పురస్కార్‌ 2021కు రచయితలు, పుస్తక ప్రకాశకుల నుంచి పుస్తకా లను ఆహ్వానిస్తున్నది. రచయితల వయస్సు జనవరి 1, 2021కు 35 సంవత్సరాలు నిండి ఉండకూడదు. బహుమతిగా రూ.50వేల నగదు ఇస్తారు. వివరాలకు: జ్ట్టిఞ://ఠీఠీఠీ.ట్చజిజ్టీడ్చ్చజ్చుఛ్ఛీఝజీ.జౌఠి.జీుఽ

కె. శ్రీనివాసు