చిక్కడపల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్య శిఖరం దివాకర్ల వెంకటావధాని అని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గానసభలో సాహితీవేత్త డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని జయంతి సభ జరిగింది. కృష్ణమోహనరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రతిభావంతమైన సాహిత్య స్రష్ట దివాకర్ల అన్నారు. దివాకర్ల చేసిన సాహిత్య కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌, కళా జనార్దనమూర్తి, సి.సంయుక్త తదితరులు పాల్గొన్నారు.