‘ఇంగులం - దళిత అస్తిత్వ వ్యాసాలు’
సంగిశెట్టి శ్రీనివాస్ రచన ‘ఇంగులం - దళిత అస్తిత్వ వ్యాసాలు’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 20 ఉ.11గం.ల నుంచి న్యూ సెమినార్ హాల్, ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాదులో జరుగుతుంది. సభలో చింత కింది కాశీం, ఘంటా చక్రపాణి, దండెబోయిన రవీందర్ యాదవ్, సి.గణేష్, కొల్లాపురం విమల, కోయి కోటేశ్వర రావు, సిహెచ్ సుశీల్ రావు తదితరులు పాల్గొంటారు.
గుడిపల్లి నిరంజన్
పర్సా సైదులు స్మారక పురస్కారం
గమ్యం-గమనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సా సైదులు జ్ఞాపకార్థం అందజేయనున్న రాష్ట్ర స్థాయి పురస్కారాలకు 2020, 2021, 2022 సంవత్సరాల్లో ప్రచురితమైన కవిత, కథ, విమర్శ, బాల సాహిత్య ప్రక్రియల నుంచి నాలుగు ప్రతుల చొప్పున సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. వీటిని మే 10లోపు చిరునామా: పర్సా శ్రీనివాస్, ఏఈఓ, అన్నపురెడ్డి పల్లి, భద్రాద్రి కొత్తగూడెం-507316కు పంపాలి. వివరాలకు: 9642163963.
పర్సా వెంకటేశ్వర్లు
‘రావిశాస్త్రి కతలు - బడుగుల వెతలు’
రాజాం రచయితల వేదిక ఆధ్వర్యంలో రావిశాస్త్రి శత జయంతి సందర్భంగా పై అంశంపై పొదిలాపు శ్రీనివాస్ ప్రసంగం ఏప్రిల్ 24 ఉ.9.30 గం.లకు విజయనగరం జిల్లా రాజాంలోగల విద్యానికేతన్ పాఠశాలలో జరుగుతుంది.
గార రంగనాథం
నాగయ్య స్మారక పురస్కారం
స్వాతంత్ర సమర యోధుడు యం. చిననాగయ్య జయంతి (జులై 1) సందర్భంగా జీవితచరిత్రలు లేదా ఆత్మకథలు రాసిన రచయితలకు, వ్యాస సంపుటి లేదా సంకలనాలని వెలువ రించిన వ్యాసకర్తలకు నాగయ్య మెమో రియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగయ్య స్మారక పురస్కారం ప్రదానం చేస్తారు. రచయితలు 2018 నుంచి 2021 మధ్య ప్రచురితమైన రచనలు రెండు కాపీ లను మే 30లోగా చిరునామా: యం. రాం ప్రదీప్, 10-263-6, ఆర్చ్ రోడ్, సాయి రాఘవ కాలనీ, తిరువూరు, ఎన్.టి.ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ కు పంపాలి. వివరాలకు: 9492712836.
రాంప్రదీప్
‘గులాబీ కవిత్వం’ కవితా సంపుటి
తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ప్రదీప్ మడూరి కవితా సంపుటి ‘గులాబీ కవిత్వం’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 23 సా.6 గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో జరు గుతుంది. సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, సీతక్క, కె ఆనందాచారి, కోయ చంద్రమోహన్ పాల్గొంటారు.
అనంతోజు మోహనకృష్ణ