హైదరాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు పుస్తకాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ ఎస్‌కే జోషి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ‘తెలంగాణ రుచుల’పై వలబోజు జ్యోతి రాసిన పుస్తకంతోపాటు పెన్నా శివరామకృష్ణ రాసిన ‘తారీఖుల్లో తెలంగాణ’, యువ పరిశోధకుడు అరవింద్‌ ఆర్య రాసిన ‘మనకు తెలియని తెలంగాణ’ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. పుస్తక రచయితలను ఆయన అభినందించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి పార్థసారథి, భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పుస్తక రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.