కరోనా రక్కసిపై యుద్ధం ప్రకటిద్దాం

సామాజిక దూరమనే ఖడ్గం జళిపిద్దాం

సరిహద్దులు దాటేలా తరిమి తరిమి కొడదాం 

 

ఇంటిలోన ఉంటూనే విజయం సాధిద్దాం
పగలనకా రాత్రనకా కంటి మీద కునుకు లేక 
మనమంతా మాటవినక  వస్తున్నా విసుగులేక 
మన బ్రతుకుల కోసమని క్షణమైనా విరమించక 
కష్టపడే మహనీయుల త్యాగలను గెలిపిస్తూ ...  కోరోనా రక్కసిపై ....  
పోరాటం ఏమి కొత్త మన భారతజాతికి 

కరోనా ఒక లెక్కా సాహసాల గడ్డకి

భయమెందుకు సోదరా ధైర్యంగా సాగరా

దూరంగా ఉంటూనే యుద్ధం చెయ్యాలిరా

 

డా. అద్దంకి శ్రీనివాస్
ఫోన్ : 9848881838