రవీంద్రభారతి,హైదరాబాద్: భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో అనువాద కవిత్వం శీర్షికన 87మంది కవులతో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. అతిథులుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చై ర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.చెల్లప్ప, ప్రముఖకవి ఎన్‌.గోపి, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కవులు, అమ్మంగి వేణుగోపాల్‌, నాళేశ్వరం శంకరం తదితరులు హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం సుమారు 87మంది కవులు అనువాద కవిత్వాలను వినిపించారు. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌ పాల్గొని కవులను అభినందించారు.