మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జూమ్‌ వేదికగా 20వ తేదీన ‘కవిత్వంలో ఇటీవలి ధోరణులు’ పై ఒకరోజు సాహిత్య సదస్సు, 21వ తేదీన కవి సంధ్య- వింజమూరి’ స్మారక కవితల పోటీ బహుమతుల ప్రదానం, యువ కవి సమ్మేళనం ఉంటాయి. సదస్సులో సుమారు 12 మంది ప్రముఖులు ఆయా అంశాలపై పత్రాలు సమర్పిస్తారు. కవి సమ్మేళనంలో దాదాపు 25 మంది యువకవులు పాల్గొంటారు. శిఖామణి అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కె.శివారెడ్డి, మామిడి హరికృష్ణ, డా. దీర్ఘాశి విజయ్‌ భాస్కర్‌, ఖాదర్‌ మోహియుద్దీన్‌, నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, దాట్ల దేవదానం రాజు, జి. లక్ష్మీనర్సయ్య , సీతారాం, చల్లపల్లి స్వరూప రాణి, ముకుంద రామారావు, మాదాసు మేరీ వినోదిని, యాకూబ్‌, కోయికోటేశ్వరరావు, మువ్వా శ్రీనివాసరావు, ప్రసాద మూర్తి, కె. గీత తదితరులు పాల్గొంటారు.

వింజమూరిస్మారకసమితి