‘‘త్వరలో నీకో భయంకరరమైన మనస్తత్వం గల వ్యక్తి పరిచయం అవుతాడు.అతని పరిచయం నీ జీవితంలో కల్లోల్లాల్ని సృష్టిస్తుంది.’’స్నేహితురాలు సింధు చెప్పిన మాటల్ని విని ఆందోళనగా ఆమెవైపు చూసింది మాధురి.‘‘నిన్ను ఆందోళనకు గురిచెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. కాస్త జాగ్రత్తగా ఉంటావని చెప్పాను. నేనన్నది నిజంగా జరగవచ్చు. జరగకపోనూ వచ్చు. బట్ బీ కేర్‌ఫుల్’’పెళ్ళయిన చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన మాఽధురికి మార్కెట్‌లో కనిపించింది చిన్ననాటి స్నేహితురాలు సింధు. మాధురి ఆమెను పిలుచుకుని వచ్చింది. తను చెయ్యి చూసి భవిష్యత్తులో జరిగే సంఘటనలను చెప్పగలనని, ఆ విద్య తను ఈ మధ్యే నేర్చుకున్నానని సింధు చెబితే మాధురి ఆసక్తిగా తన చేయి చూపించుకుంది. సింధు చెప్పింది విన్నాక ‘తను చేయి చూపించకుండా ఉండి ఉంటే బాగుండేది. అనవసరంగా లేని భయాల్ని, ఆందోళనల్ని తెచ్చుకున్నాను’ అనుకుంది మాధురి.‘‘మీ ఆయన చాలా బాగున్నారు’’ మాధురి పెళ్ళి ఆల్బమ్ చూస్తూ అంది సింధు.‘‘నువ్వూ ప్రేమాలో పడ్డావని విన్నాను. అతని ఫోటో ఉందా నీ దగ్గర’’‘‘మనసులోనే కాదు. పర్సులో కూడా ఉన్నాడు’’ అని నవ్వుతూ ఫోటో మాధురికి అందించింది సింధు.‘‘బాగున్నాడు’’ ఫోటో చూస్తూ అంది మాధురి.‘‘మీ ఆయనంత కాదులే . కానీ చాలా మంచివాడు’’‘‘మా ఆయన కూడా మంచివాడే’’‘‘కాదని నేనన్నానా తల్లీ. నా ప్రియుడి గురించి చెప్పాను. అంతే. బాంచను నీ కాల్మొక్త’’ స్నేహితు రాళ్ళిద్దరూ నవ్వుకున్నారు.
ఆ హోటల్ కాంపౌండ్‌లో ఉన్న గార్డెన్ ఎదు రుగా వీల్‌ఛైర్‌లో కూర్చుని ఉన్న మాధురిని సమీపించిన ఆ యువకుడు ‘‘కెన్ ఐ హెల్ప్‌యు’’ అని అడిగాడు.‘‘నో ధాంక్స్. మావారు రూమ్ బుక్ చేయడం కోసం రిసెప్షన్ కౌంటర్‌కు వెళ్ళారు. టాక్సీ అతను వెళ్ళాలని తొందర చేస్తే నన్ను యిక్కడ ఉంచి వెళ్ళారు. ధాంక్సూ ఎనీవే ఫర్ యువర్ కన్సర్న్’’ అంది మాధురి.‘‘ఫర్వాలేదు. నా పేరు సాగర్. టీవీ సీరియల్స్ రాస్తుంటాను. హ్యాపీ టైమ్ అట్ వైజాగ్. బై’’అతను వెళ్తున్న వైపే చూస్తూండి పోయింది మాధురి.‘నవ్వు ముఖంతో ఎంత చలాకీగా ఉన్నాడు ఇతను. ఇటువంటి వ్యక్తులు తాము సంతోషంగా ఉండటమే కాదు, తమ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా సంతోషంగా ఉంచుతారు’ అనుకుంది.్‌్‌్‘‘ ‘భర్తంటే భార్యను భరించేవాడు’ అని విన్నాను. దాని అర్థమేంటో యిప్పుడు తెలిసింది నాకు’’ మాధురిని వీల్‌ఛైర్ మీది నుంచి మంచంపై కూర్చోబెడుతూ అన్నాడు సురేష్.‘‘భార్యంటే మజాకా మరి?’’ అంది మాధురి నవ్వుతూ.తర్వాత సురేష్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని టై కట్టుకుంటూంటే అతన్నే తదేకంగా చూడసాగింది మాధురి.