అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ ఆధ్వర్యంలో సాహితీ సదస్సు డిసెంబర్‌ 14 ఉ.9గం.ల. నుంచి తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముందు తరాలతో సంభాషణ కార్యక్రమంలో కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్‌, ఓల్గా, అఫ్సర్‌, కసిరెడ్డి వెంకట రెడ్డి; ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు కార్యక్రమంలో కె.ఎన్‌.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్‌, పూడూరి రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్‌, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి పాల్గొంటారు. 12 మంది కొత్త తరం కవులతో కవి సమ్మేళనం; దేశపతి శ్రీనివాస్‌, చంద్రబోస్‌, గోరటి వెంకన్న, అనంత శ్రీరామ్‌, సిరాశ్రీ, శ్రేష్ట, ప్రొద్దుటూరి యెల్లారెడ్డి పాల్గొనే ‘పద్యం, పాట, జానపదం’ కార్యక్రమాలు కూడా ఉంటాయి.

రవీందర్‌ వీరెల్లి