‘రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారం 2019’ను కవిత్వానికి జూకంటి జగన్నాథం స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ డిసెంబర్‌ 15 ఉ.10.30గం.లకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పిజీ కాలేజ్‌లో జరుగుతుంది. గ్రహీతకు రూ.15వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది. బి.ఎస్‌. రాములు, అంపశయ్య నవీన్‌, నలిమెల భాస్కర్‌, పెద్దింటి అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొం టారు. ఈ సందర్భంగా రామా చంద్రమౌళి మూడు పుస్తకాల ఆవిష్కరణ కూడా ఉంటుంది.

కె. పురుషోత్తం