సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి గాను ప్రతీ యేటా ఇచ్చే ‘శిఖామణి సాహితీ పురస్కారం’ 2020కి శీలావీర్రాజు ఎంపిక అయ్యారు. అవార్డు కింద రూ.10వేల నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కారం ఉంటుంది. ఈ ప్రధాన పురస్కారంతో పాటు కవి సంధ్య ప్రతిభా పురస్కారాలకు ఎస్వీ రాఘవేంద్ర రావు, జ్యోతి చంద్ర మౌళి, దిలావర్‌, పెనుగొండ లక్ష్మీ నారాయణ, సంగెవేని రవీంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్‌, విజయ చంద్ర, చల్లపల్లి స్వరూపరాణి ఎంపిక అయ్యారు. అవార్డు ప్రదాన సభ అక్టోబరు 30 సా.5గంటలకు జూమ్‌ వేదికపై జరుగుతుంది.

దాట్ల దేవదానం రాజు