‘శాంతి, సామరస్యం, పౌర సహజీవనం భారత రాజ్యాంగ విలువలు, ఆదర్శాలు– మన కర్తవ్యాలు’ అనే అంశంపై మహబూబ్‌నగర్‌, రాయిచూర్‌ రోడ్‌లోని ఆలీమార్ట్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో 7వ తేదీ, శనివారం ఉదయం 10 గంటలకు సదస్సు జరుగుతుంది. హక్కుల ఉద్యమకారుడు ప్రొ.జి. హరగోపాల్‌, కేంద్ర సమాచార హక్కుల కమిషన్‌ మాజీ కమిషనర్‌ ప్రొ.మాడభూషి శ్రీధర్‌, ఉర్దూ దినపత్రిక ‘సియాసత్‌’ ప్రధాన సంపాదకుడు జహీర్‌ అలీఖాన్‌ ప్రసంగిస్తారు. 

– శాంతి ఉద్యమం, మహబూబ్‌నగర్‌