విశాఖ, 31-10-2019: నవంబరు 1 నుంచి 24వ తేదీ వరకు టర్నర్‌ చౌల్ర్టీలో విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు విశాలాంధ్ర బుక్‌హౌస్‌ మేనేజర్‌ పీఏ రాజు తెలిపారు. బుఽధవారం టర్నర్‌ చౌల్ర్టీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గల అన్ని బుక్‌హౌస్‌లలో విశాఖ నగరంలో ఉన్న విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సావాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ తెలుగు ప్రచురణకర్తల పుస్తకాలు అన్నీ సేకరించి ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ఇరవై వేల రకాల పుస్తకాలను సేకరించామని వివరించారు. పుస్తకప్రియులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.