తెలుగుపాఠకులకు చిరపరిచితులైన రచయిత సలీం. సమకాలీన సమాజ సమస్యలను ప్రతిబింబించే కథానవలా రచయిత. సంస్కరణవాది, సంఘాన్ని పట్టిపీడించే రుగ్మతలను ఖండిస్తూ ఎన్నో రచనలు చేశారు. ఆయన మరో నవల ‘అరణ్య పర్వం’. మరాఠాకు చెందిన పార్ది తెగకు పులుల్ని వేటాడి చంపి వాటి చర్మం అమ్ముకోవడమే జీవనోపాధి. ఇలా ఆ తెగ 50వేల పులుల్ని చంపింది. పులులు అంతరించిపోవడానికి అదీ ఒకకారణమే. ఆ పార్ది తెగకు చెందిన గుంజన్‌కీ, తన తల్లిని చంపినందుకు ప్రతీకారంతో రగిలిపోతూ గుంజన్‌పై దాడిచేయడానికి Man Eater గా మారిన ఒక మగపులికీ మధ్య జరిగిన ఎత్తులు, పైఎత్తులు, దాడి–ప్రతిదాడుల చిత్రణే ఈ ‘అరణ్యపర్వం’ నవల.

అరణ్యపర్వం (నవల)

 

సలీం
ధర : 120 రూపాయలు, పేజీలు: 152
ప్రతులకు జ్యోతివలబోజు, సెల్‌ 80 963 10 140 మరియు అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు