చిరునామా కోసం పోరాటం

బొంబాయికి వలసపోయి.. మహారాష్ట్ర సమాజంలో పాలలో నీళ్ళలా లీనమైపోయిన కవి సంగెవేని రవీంద్ర. ఆయన వ్యక్తపర్చిన హృదయవేదన ‘చౌరాస్తాలో సముద్రం‘ కవితా సంపుటి. గతంలో తను వెలువరించిన ‘వలస పత్రం’కు ఇదికొనసాగింపు. కొన్ని నిశ్శబ్ద రోదనలు దశాబ్దాల పర్యంతం ఎంత పంచుకున్నా ఒడవవు. ‘నా శ్వాసనిండా నా ఊరి పరిమళాలే/ నా కళ్ళనిండా నా ఊరి పొలిమేరలే/ అయినా అన్నం పెట్టిన ఈ పరాయి నేలను/ నా దేహజలంతో అభిషేకించాను/ నరాల తీగెలు పరిచి పరిసరాలు/ వెలిగించాను/ మనిషికి ఒకే ఒక్క జన్మ ఉన్నట్టు/ఒక్క ఊరే ఉంటే ఎంత బాగుండు’ ... లాంటి కవితా వాక్యాలు పుస్తకాన్నీ, కవి హృదయాన్నీ పట్టిస్తాయి.

- రామా చంద్రమౌళి

చౌరాస్తాలో సముద్రం (కవిత్వం),

రచన: సంగెవేని రవీంద్ర

పేజీలు: 108, వెల: రూ. 100,

ప్రతులకు: 099871 45310