యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వంటి యోగ్యుడైన గొప్ప శిష్యుణ్ణి పొందిన గురువు, కథ, నవల, నాటక రచయిత, అనువాదకుడు కొచ్చర్లకోట వెంకట సుబ్బారావుగారు. ఆయన రాసిన మూడు కథా సంపుటాలివి. వీటిల్లో మొదటిది కామెడీకథల సంపుటి. రాజకీయ, హాస్య వ్యంగ్య రచయితగా ఆయన సత్తాచాటిన పాతికకథలివి. మరొకటి 32 కథలున్న ‘మృగతృష్ణ’ కథల సంపుటి. మాన, ప్రాణాపద సమయంలో సైతం సంఘ కట్టుబాట్లు పాటించిన స్ర్తీ ఆలోచనలకు దర్పణం టైటిల్‌ కథ ‘మృగతృష్ణ’. విలువలకు పెద్దపీట వేసిన కథలే ఇవన్నీ. ఇంకొకటి 17 కథలున్నా ‘ఓం శాంతి! ఓం శాంతి!’ కథల సంపుటి. ఇవన్నీ పలు పత్రికల్లో వచ్చినవే. ఇందులోని టైటిల్‌ కథ ఒక వ్యవస్థ వైఫల్యాన్ని కళ్ళకు కడుతుంది. వ్యంగ్యధోరణి కథలివి.

కామెడీ కథలు

కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు

ధర 150 రూపాయలు

పేజీలు 234

మృగతృష్ణ కథల సంపుటి

కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు

ధర 100 రూపాయలు

పేజీలు 166

ఓం శాంతి! ఓం శాంతి!

కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు

ధర 125 రూపాయలు

పేజీలు 184

ప్రతులకు

రచయిత, ఇంటినెంబరు 5, పదవ వీధి, న్యూ కాలనీ, భారతీనగర్‌, విజయవాడ–08

సెల్‌ 9440544614