గ్రామీణ హృదయానికి, వ్యవసాయ జీవితానికి దర్పణం దర్భశయనం శ్రీనివాసాచార్య కవిత్వం. ఆయన కలం ఆయనకు ఎన్నో పురస్కారాల్ని తెచ్చిపెట్టింది. చెప్పాలంటే, ఆయనది ‘పొలం గొంతుక’. ఆయన కవిత్వ హృదయం ఓ ‘పత్రహరితం’. ‘నేలగంధం’ పూసుకున్న ఆయన కవిత్వం ఇప్పుడు మళ్ళీ ‘ధాన్యం గింజలు’ గా మొలకెత్తి 36కవితలుగా ఈ గాదెలో రాశిపోసుకుని మనముందుకు వచ్చింది. ఆయన రాసిన మరో పుస్తకం ‘బాలలకోసం బాటసారి పదాలు’’. పొలాలకు దండం పెట్టు/రైతులకు హారతిపట్టు/పల్లెలకు పట్టం కట్టు/ఓ బాటసారీ...అంటూ ‘‘బాటసారి’’ అనే మకుటంతో రాసిన బాలల పదాలే ఇవన్నీ.

ధాన్యం గింజలు

దర్భశయనం శ్రీనివాసాచార్య

ధర : 80రూపాయలు, పేజీలు 88

బాలలకోసం బాటసారి పదాలు

దర్భశయనం శ్రీనివాసాచార్య

ధర : 60రూపాయలు, పేజీలు 72

ప్రతులకు : రచయిత,

సెల్‌ 94404 190 39 మరియు

తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ పుస్తక దుకాణాలు