తెలంగాణ ఆత్మగౌరవ వ్యక్తీకరణ వేదిక గోలకొండ పత్రిక. నివురుగప్పినట్టున్న సాహిత్యాగ్నులను ప్రజ్వలింపజేసిన ఘనచరిత్ర ఆ పత్రికదే. 1934లో ‘మా చిన్న కథ’ పేరిట తెలంగాణ కథకులను ప్రోత్సహించి తెలంగాణ కథావైభవానికి పట్టంకట్టింది ‘గోలకొండ’.  అందులోని 52 కథల (1926–35) సంపుటే ఈ పుస్తకం. శేషాద్రి రమణకవులు, నెల్లుట్ల శేషగిరిరావు, సంగిశెట్టి బాలయ్య, ఆదిరాజు వీరభద్రరావు, పెబ్బర్తి, భాస్కరభట్ల, బొడ్డుబాపిరాజు, వీరయ్య, ఉన్నవ వేంకటరామయ్య, సురవరం ప్రతాపరెడ్డి ప్రభృతులెందరో రాసిన ఆనాటి సమాకాలీన కథావస్తులెన్నో ఇందులో ఉన్నాయి. 


గోలకొండ పత్రిక కథలు
సేకరణ–కూర్పు యామిజాల ఆనంద్‌, డా.వి.వి.వెంకట రమణ
ధర 190 రూపాయలు
పేజీలు 252
ప్రతులకు నవచేతన, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్‌హౌస్‌లు