సంస్కరణవాద కుటుంబంలో పుట్టిపెరిగిన మహిళా ఉద్యమ నాయకురాలు, చిరస్మరణీయురాలు ఇల్లిందల సరస్వతీదేవి. సమకాలీన తెలంగాణ ఉద్యమంతో ప్రభావితురాలైన ఆంధ్ర యువతీమండలి వ్యవస్థాపక సభ్యురాలు. వెలకట్టలేని అపార విజ్ఞానాన్ని ముందు తరాలకు ఆమె సమకూర్చివెళ్ళారు. ఆమె ప్రసిద్ధ నవల ‘నీ బాంచను కాల్మొక్త’ సహా పదమూడు నవలల్లో స్ర్తీ సమస్యలు, మధ్యతరగతి జీవితాన్ని, సంకెళ్ళలో ఉన్న స్ర్తీ జీవితాలను ఆవిష్కరించిన రచయిత్రి. ఆమె రాసిన వందలాది కథల్లో ఎంపిక చేసిన 25 కథల సంకలనమిది. ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు డా.ముదిగంటి సుజాతారెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ సంకలనంలోని కథలన్నీ జీవితాలను కళ్ళముందు ఆవిష్కరించడమే కాదు, ఆదర్శజీవిత మార్గాల్ని కూడా తెలియజేస్తాయి. 

 

ఇల్లిందల సరస్వతీదేవి  ఉత్తమ కథలు
సంపాదకులు ముదిగంటి సుజాతారెడ్డి
ధర 225 రూపాయలు
పేజీలు 238
ప్రతులకు నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, ఉస్మానియా క్యాంపస్‌, హైదరాబాద్‌ వెబ్‌సైట్‌ www.nbtindia.gov.in