తూర్పుగోదావరిజిల్లాలోని రెండు మూడు ప్రాంతాలకు చెందిన క్షత్రియ కుటుంబ గ్రామాల్లో జరిగిన సంఘటనల జ్ఞాపకాలే ఈ ‘కాకిబొడ్డు’ సంపుటిలోని పన్నెండు కథలూ. క్షత్రియ కుటుంబాల కట్టుబాట్లు, వారి లోగిళ్ళలోని సంప్రదాయాలు, ఆనాటి సామాజిక పరిస్థితులకనుగుణంగా ఉన్న ఆ మనుషుల ఆలోచనలు, నాటి సజీవ భాషను రచయిత ఈ కథల్లో ఆవిష్కరించారు. 

ఇప్పటితరం కచ్చితంగా చదవాల్సిన కథలివి. ఎందుకంటే, గడచిన ఐదు దశాబ్దాల్లో స్ర్తీలు ఎంతటి గొప్ప అభివృద్ధి సాధించారో, ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నారో, భారతదేశంలో ఏ స్థితినుంచి ఏ స్థాయి వరకు మానసికంగా, సామాజికంగా ఎలాంటి గొప్ప మార్పులు సంభవించాయో బేరీజు వేసుకోవాలంటే ఈనాటి 16–20 ఏళ్ళ వయసుగల యువతరం ఈ కథలు చదివి తీరాలి. ముఖ్యంగా టైటిల్‌ కథ ‘కాకిబొడ్డు’ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. తన సొంత మామిడితోటనూ, తను బతుకుతున్న గ్రామంలోని వీథులనూ కూడా ఏనాడూ చూడని ఒక ఘోషా స్ర్తీ జీవితానికి అద్దం పట్ట కథ ఇది. ‘ఊరు మంచం దిగకముందే వెళ్ళొచ్చేయాలి...’, ‘కంచెంబుతో మజ్జిగ దాహం పుచ్చుకోవడం లాంటి మాటలు మనల్ని అలరిస్తాయి.

కాకిబొడ్డు     (కథలు)

చిరంజీవి వర్మ
ధర 200 రూపాయలు
పేజీలు 162
ప్రతులకు  ఎమెస్కో, విశాలాంద్ర, ప్రజాశక్తి, నవోదయ, నవచేతన మరియు మిగిలిన అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు