కథానందనం (సంకలనం)
డా.భువన్‌
ధర 400 రూపాయలు
పేజీలు 614
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, కథానిలయం ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు
 
తెలుగు కథల ప్రచురణ బాధ్యత చేపట్టిన డా.భువనేశ్వరరావు ప్రచురించిన వందకథల తాజా సంకలనం ‘కథానందనం’. మూడుతరాల జీవనచిత్రణకు దర్పణంపట్టే సంకలనం. లబ్దప్రతిష్ఠులైన ఇరవైమంది పాతకొత్త రచయితలు, రచయిత్రుల ఐదేసికథలున్నాయి ఇందులో.

మధ్యతరగతి ఆత్మీయతలు, ఆకర్షణలు, నైతికబాధ్యతలు, నాగరికుల హీనవర్తన, మానవత్వపరిమళాలు, ప్రవాసాంధ్రులు–ఇక్కడి పిల్లల మధ్య సంస్కారభేదాలు, స్ర్తీ హృదయం, హాస్యం, రాజ్యకీయవ్యంగ్యం వంటి అనేక అంశాల కథలు చదువుకోవచ్చు. బాలిగారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. బుద్ధికి పదునుపెట్టి, మనస్సుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించే కథలివి.