ప్రాచీన కావ్యాలను ఆస్వాదించాలని కోరుకోరువాళ్ళెవరు? కానీ ఆ గోదాలోకి దిగాలంటే ప్రౌఢగ్రాంథికం, సంస్కృతం రావాలి. అందుకే ఈనాటివారంతా సులభంగా చదువుకునేలా మల్లన రాజశేఖరచరిత్రము పుస్తకాన్ని వ్యాఖ్యాన సహితంగా మనకు అందించారు. దేశవిదేశీయుల్ని అలరించిన రచయిత, సాహిత్య పరిశోధకుడు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. మూడు అశ్వాసాలున్న కావ్యమిది. ఆవంచిక మహానగరాన్ని పాలించే హేమధన్వుడనే మహారాజు కుమారుడు రాజశేఖరుడి చరిత్ర ఇది. నాటి రాజుల అలవాట్లు, సంప్రదాయాలు, తెలుగుపద్య, భాషా మాధుర్యాన్ని ఈ ఫిక్షన్‌కథలో సామాన్యపాఠకులు కూడా ఆస్వాదించేలా వ్యాఖ్యానం చెప్పి పద్యప్రియుల ఆకాంక్షలను నెరవేర్చిన ‘పాఠకమిత్ర’ వ్యాఖ్య పుస్తకమిది. పుట్టపర్తినారాయణాచార్యులవారి ఉపోద్ఘాతం దీనికి తలమానికం.

 

మాదయగారి మల్లన రాజశేఖరచరిత్రము
వ్యాఖ్యాత బేతవోలు రామబ్రహ్మం
ధర 300 రూపాయలు పేజీలు 384
ప్రచురణ అమరావతీ పబ్లికేషన్స్‌, ప్రతులకు విశాలాంధ్ర బుక్‌హౌస్‌ బ్రాంచీలు