సాహితీక్షేత్రంలో తనదైన ముద్రవేసుకున్న ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి. వ్యవసాయం మందులసేద్యంగా మారిన ప్రస్తుత తరుణంలో బతుకును పచ్చగా మార్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉన్న ఓ సృజనాత్మక రచయిత. కళాత్మకమైన జీవితం కోసం సేంద్రీమసాగు ద్వారా సహజాహారాన్ని పండించే క్రమంలో తను ఇదివరకే ముఖపుస్తకంలోను, వాట్సాప్‌గ్రూపుల్లోనూ పంచుకున్న విషయాలకు పాదుచేసి పందిరివేసి, ‘మిద్దెతోట’ గా పాఠకులకు అందించారు రఘోత్తమరెడ్డి. ఈ పుస్తకంలో రచయిత వివిధ విభాగాలకు, శీర్షికలు ఎంతో టెంప్టింగ్‌ గా అర్థవంతంగా ఉండి పాఠకులకు వెంటనే చదవాలనిపిస్తుంది. తను పర్యవేక్షించిన ప్రతిచిన్న విషయాన్నీ వదలకుండా ఒక పద్ధతిగా చక్కటి ప్రణాళికతో ఈ పుస్తకంలో పొందుపరచడంవల్ల పాఠకులకు ఇదెంతో ఉపయుక్తమైన కరదీపికలా దోహదపడుతుంది.చేయి తిరిగిన ఈ కథారచయిత మిద్దెతోటపై మొలకెత్తించిన అక్షరాలను ఇంపైన పదప్రయోగాలు, సరళభాష, చక్కటిశైలితో ఓ సమాహారంగా రూపొందించారు. సాధారణంగా ఎవరూ స్పృశించేందుకు సాహసించని అంశాన్ని చేపట్టిన రచయిత అభినందనీయులు. ప్రతిపేజీలో వర్ణచిత్రాలు, బాక్సులు ఈ మిద్దెతోటకు తోరణాలుగా నిలుస్తాయి.

తుమ్మేటి రఘోత్తమరెడ్డి

ధర 349 రూపాయలు

పేజీలు 182

ప్రతులకు రైతు నేస్తం పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌ 040–23395979., 9676797777.