కన్నడ కవి, కథానవలా రచయిత, నాటక కర్త మల్లికార్జునపాటీల. కన్నడభాషలో ఆయన రాసిన ఈ నవల ఇప్పటికే ఐదు ముద్రణలు పొంది ప్రముఖుల ప్రశంసలందుకున్నది. గ్రామీణ భారతావనికి అద్దంపట్టే కల్లప్ప అనే ఒక రైతు దయనీయ జీవితమే ఈ నవల. తెలుగువారికి సుపరిచితుడైన రచయిత అనువాదకుడు, పలు పురస్కారాల గ్రహీత రంగనాథ రామచంద్రరావు చక్కటి భాషలో దీనిని అనువదించారు.

 

ఓ రైతు కథ (నవల)
కన్నడ మూలం డా.మల్లికార్జున పాటీల
అనువాదం రంగనాథ రామచంద్రరావు
ధర 80 రూపాయలు
పేజీలు 104
ప్రతులకు ఆర్‌. రామచంద్రరావు, బేంగపేట, హైదరాబాద్‌–16, నా పుస్తకం, త్యాగరాజ నగర్‌, హిందూపురం, మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు