కఠిన వాస్తవాల కలనేతలు

ప్రపంచీకరణ క్రమంలో మాయమైన గ్రామాల్నీ, మాయమై ప్రత్యక్షమైన పట్టణాల్నీ రెండిటినీ సమానంగా వివరించే కథలివి. ‘పట్టణంపై పీడ నీడ’, ‘పట్టణంలో జంతువులు’, ‘రియల్‌ సదాశివం’, ‘ఇక సారాదేవత’, ‘టీవీ ఆపరేటర్‌ కావలెను’, ‘దోమకాపురం’ - విలక్షణమైన ప్రయోగాత్మక కథలు. సమాజంలోని వ్యక్తులనూ, ధోరణులను సజీవ పాత్రలుగా మార్చి ఆసక్తిగా చదివించే కథలివి. కల్పనలా అనిపించే కఠిన వాస్తవాల సృజనాత్మక కలనేతలీ కథలు. పట్టణీకరణ గ్రామ సమాజాలపై అందులోని వ్యక్తుల జీవితాల్లో సృష్టిస్తున్న దారుణాన్నీ, సంక్షోభాన్నీ, అనైతికతనూ ఈ కథలు విస్తారంగా అనేక ఘటనల నేపథ్యంలో వివరిస్తాయి. ఇసుక మాఫియా, బెట్టింగ్‌ బైక్‌ రేసులు, స్వలింగ సంపర్కం వంటి తెలుగు సమాజం కొత్తగా ఎదుర్కొంటున్న అత్యాధునిక సమస్యలనూ గ్రామీణ సమాజ పురాతన సమస్యలనూ రెండిటినీ ఏకకాలంలో కథారూపం ఇవ్వడం ఈ సంపుటి ప్రత్యేకత. కొన్ని కథలలో కథకంటే సందేశాత్మక, ఉపన్యాసధోరణీ, అకారణ దుఃఖం ఎక్కువైనా పాఠకులను ఆలోచింపజేసే కథలివి.

                                                                                                                                                      - డి.ఎల్‌.

 

ఊరు కనబడుటలేదు,

నీలకంఠ

పేజీలు : 140

వెల : రూ.120

ప్రతులకు : విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు