తెలుగునాట ఉషశ్రీ అంటే తెలియనివారులేరు. డెబ్భయ్యవ దశకంలో రేడియో మాధ్యమంద్వారా శ్రోతలను ఉర్రూతలూగించిన కవి, కథకుడు, నాటక, ఉపన్యాకర్త, వ్యాఖ్యాత ఉషశ్రీ. ప్రధానంగా ఆయన స్ర్తీ పక్షపాతి. పెళ్ళాడే యువతులు, స్ర్తీలు ఇంటా బయటా, ఆఫీసులో ఎలా ఉండాలో, రాబందులు, గుంటనక్కల బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఎలా మాట్లాడాలో వివరించిన చక్కటి పుస్తకం. అరవయ్యో దశకంలో నాటి కృష్ణాపత్రికలో ధారావాహికగా వెలువడిన నవలా లేఖావళి ఆడపిల్లల్లో కావాల్సినంత ధైర్యం నూరిపోసింది. చిరంజీవినీ, సౌభాగ్యవతీ, కన్నతల్లీ అని సంబోధిస్తూ రాసిన కాలం చెల్లని ఈ 30 లేఖలు ఈ నాటి యువతులకు ప్రవర్తనలకు సంబంధించిన జ్ఞానాన్ని, చైతన్యాన్ని అందిస్తాయి.

పెళ్ళాడేబొమ్మా
ఉషశ్రీ
ధర 120 రూపాయలు
పేజీలు 168
ప్రతులకు దీప్తి ప్రచురణలు, మ్యూజియం రోడ్‌, విజయవాడ–02 సెల్‌ 9849065280