ప్ర‌పంచ క‌థాసాహిత్యంలో ప్రసిద్ధ క‌థ‌కుల‌ను తెలుగు పాఠ‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌నే సంక‌ల్పంతో వ‌చ్చిన క‌థాసంక‌ల‌నం ఇది. మొత్తం 20 క‌థ‌ల స‌మాహారం. తొమ్మిది భాష‌ల నుంచి ఏరికోరి తీసుకున్న ఉత్త‌మ ర‌చన‌ల‌ను తెనుగీకరించి, మ‌న‌కు అందించారు ర‌చ‌యిత కె.బి.గోపాలం. వివిధ దేశాల ప్ర‌సిద్ధ ర‌చ‌యిత‌లు, నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌ల క‌థ‌లున్నాయిందులో. ఒక్కో క‌థా ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంటుంది. ప్ర‌పంచ సాహిత్యంలోని క‌థ‌ల తీరును, విభిన్న‌త‌ను తెలుసుకోవాలని కోరుకునేవారు త‌ప్ప‌క చ‌ద‌వాల్సిన క‌థాసంక‌ల‌నం ఇది. ఈ కథలు చదువుతుంటే, క‌థ‌ల ఎంపిక‌లో ర‌చయిత చేసిన‌ కృషి, శ్ర‌ద్ధ అవ‌గ‌త‌మ‌వుతాయి.

 

 

ప్ర‌పంచ క‌థ 
అమెరికా కొడుకు
–మ‌రిన్ని క‌థ‌లు
(వివిధ భాషలలో ప్రసిద్ధ రచయితల కథలు)
సేకరణ, తెలుగు కథనం: కె.బి.గోపాలం
పేజీలు: 150
ధర: 150 రూపాయలు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు