పురాణ నేపథ్యంలో పదబంధాలు మన నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధాలైపోయాయి. అలాంటి పదబంధాల వెనుక ఉన్న కథలు సుమారు 135 పైగా మనకీ పుస్తకంలో ఒకచోట చేర్చి అందించారు సీనియర్‌ జర్నలిస్టు, రచయిత బమ్మిడి జగదీశ్వరరావు. ‘చూసి రమ్మంటే కాల్చివచ్చాడు...త్రిశంకుస్వర్గం, పట్టువదలని విక్రమార్కుడు, చిదంబర రహస్యం, గొంతెమ్మ కోరికలు, హనుమంతుడిముందు కుప్పిగంతులు, చంద్రుడికో నూలుపోగు, కంచి గరుడసేవ, ఇంటి గుట్టు లంకకు చేటు...ఇలా అనేక పురాణ పదబంధాల కథలిందులో ఉన్నాయి. ప్రతి ఇంటా తప్పక ఉండాల్సిన పుస్తకమిది. 

 

బమ్మిడి జగదీశ్వరరావు
ధర 75 రూపాయలు
పేజీలు 134
ప్రతులకు మంచి పుస్తకం, తార్నాక, సికింద్రాబాద్‌–17 ఫోన్‌ 94907 46 614