ప్రపంచాన్ని అర్థం చేసుకున్న కవి, రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ద్వా.నా.శాస్త్రి. కృష్ణాజిల్లాలో పుట్టి అమలాపురంలో ముప్ఫైఏళ్ళు అధ్యాపక వృత్తిచేసి తెలంగాణలో స్థిరపడి ఇక్కడి తెలుగువారి ఆదరాభిమానాలు, సత్కార సన్మానాలు పొందారు. ఉభయరాష్ట్రాల మన్ననలు అందుకున్న సాహిత్యపిపాసి ద్వా.నా.శాస్త్రి జీవిత ప్రయాణమే, ‘సాహిత్యమే శ్వాసగా నా గురించి నేను’ పుస్తకం. తెలుగుభాషాసాహిత్యాలకు ఆయన గొప్ప సేవలు అందించారనడనికి తార్కాణం ఆయన రచనలే. ఉభయరాష్ర్టాల్లో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే పుస్తకాలు రాశారు. లెక్కకు మిక్కిలిగా పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. ఆయన జీవితం తెరచిన పుస్తకం. ఆయన అలవాట్లు, రాతిని చీల్చుకుని వృక్షంగా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం, నత్తిని అధిగమించి ఉపాధ్యాయుడుగా ఉపన్యాసాలలలో రికార్డుసృష్టించే స్థాయికి ఎదగడం, కుటుంబ జీవితం, సాహిత్య రచనలు...వంటివి ఈ పుస్తకం చదివిన ప్రతిఒక్కరికీ మార్గదర్శకం.

ఆయన మరో పుస్తకం ‘భాషా సాహిత్యాల వారధి చేకూరి రామారావు’. చేరాతో తన అనుభవాలు, చేరా భాషా పరిశోధన, సాహిత్యం, విద్యార్థులను తీర్చిదిద్దిన వైనం, ఆయన కవిత్వంసహా అనేకాంశాలు వివరిస్తూ 16 శీర్షికల్లో తన అనువాదాలు జోడించిన పుస్తకమిది.

 

సాహిత్యమే శ్వాసగా
నా గురించి నేను
డా. ద్వా.నా.శాస్త్రి 
ధర 300 రూపాయలు
పేజీలు 240
ప్రతులకు రచయిత, ఇ.నెం 1–1–428, గాంధీనగర్‌, హైదరాబాద్‌ –80 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు