ప్రవాసాంధ్ర రచయిత్రి, దర్శక నిర్మాత కోసూరి ఉమాభారతి. అంతకుమించి హ్యూస్టన్‌లో కూచిపూడి నృత్యశిక్షణాలయ వ్యవస్థాపకురాలు, నాట్యభారతి బిరుదాంకితురాలు. గడచిన ఐదేళ్ళకాలంలోనే రచయిత్రిగా ఎదిగి కథానవలా ప్రక్రియలో పేరు తెచ్చుకున్నారు. ఆమె తాజా కథల సంపుటి ‘సరికొత్త వేకువ’ వంగూరి ఫౌండేషన్‌వారి 71వ ప్రచురణ.  టైటిల్‌ కథ ‘సరికొత్త వేకువ’ లో బంగారం పాత్రధారి జీవితానుభవాలు, త్యాగనిరతి మానవ సంబంధాలకు సరైన అర్థాన్ని చెబుతాయి. ఇందులోని పది అమెరికా, ఇండియా కథలన్నీ మన చుట్టూ తారట్లాడే పాత్రల స్వభావాల్ని రూపుగడుతూ, ప్రేమ, త్యాగం, ధీరత్వం, విశ్వాసం, ఆత్మీయానుంధాలువంటి వాటి చాటిచెబుతాయి. మన మనసును తాకి ఆలోచనలు రేకెత్తిస్తాయి.  

 

సరికొత్త వేకువ కథలు
కోసూరి ఉమాభారతి
ధర 100 రూపాయలు
పేజీలు 176
ప్రతులకు జె.వి.పబ్లికేషన్స్‌, ఫోన్‌ 80963 10140, నవోదయ బుక్‌హౌస్‌, ఆర్యసమాజ్‌ ఎదురుగా, హైదరాబాద్‌ మరియు అన్ని మంచి పుస్తక విక్రయ కేంద్రాలలో.