15వ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి తెనిగించిన శ్శ్రీహర్షుని సంస్కృత మహాకావ్యం ‘శృంగార నైషధం’లో వెలుగుచూడని, శ్రీనాథుడు దర్శించని ఎన్నో శాస్త్రాలను సప్రమాణంగా నిరూపించే శేషేంద్రశర్మ విమర్శనాగ్రంథం ‘స్వర్ణహంస’. ఈ కావ్యంలోని రహస్య అంతరాత్మగా మరుగున పడిన మంత్ర, యోగ, వేదాంతశాస్త్ర సంబంధాన్ని వెలికితీసి భాషా అధ్యయన అవగాహన పరిథిని విస్తరించిన ఈ రచన తెలుగు, ఆంగ్లభాషల్లో వెలువడింది.

స్వర్ణహంస

హర్షనైషధ కావ్య పరిశీలన

శేషేంద్ర

ధర 125 రూపాయలు

పేజీలు 134