వర్తమాన వైపరీత్యాలను ఎత్తిపొడుస్తూ సాగిన రచన ‘వసుధా(స)మయం’. ఏ కాలాన్నయినా తన ‘కాలమ్‌’లోకి ఇమిడ్చి హితవచనం చెప్పే ప్రయోగ శీలత సుధామ ప్రత్యేకత! విభిన్న జీవన పార్శ్యాలపై 2018 నుంచి రాసిన వ్యాసాల సంకలనం ఇది. భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేస్తూ రాజకీయ పోకడలపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. విలువలు - విధానాలు - విప్లవాలు - విధ్వంసాలు.. ఒకటా రెండా సమకాలీన జీవన ధోరణులన్నిటి పైనా చక్కటి శైలితో చేసిన పసందైన విందు ‘సుధామయ’సారం!

- వల్లూరి రాఘవరావు

వ‘సుధా(స)మ’యం (కాలమ్‌),

రచన: సుధామ

పేజీలు: 145,

వెల: రూ.150,

ప్రతులకు: 98492 97958