భారతీయతంటేనే అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనం. కానీ, ఒకరి గురించి మరొకరికి తెలిసింది మాత్రం అతి స్వల్పం. విదేశీ సాహిత్యం తెలిసినంతగా ఇరుగు పొరుగు రాష్ర్టాల సాహిత్యం తెలియకపోవడం శోచనీయం. ఇందుకు కారణం అనువాద సాహిత్యం విస్తృతంగా రాకపోవడమే. తెలుగులో అతి కొద్ది అనువాదకుల్లో ఒకరు కాకాని చక్రపాణి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో గుర్తించిన 21 భాషల కథలను తెలుగు పాఠకులకు అందించేందుకు, సుమారు 75 కథలను తెలుగులోకి తర్జుమా చేశారాయన. ఇస్మత్‌ చుగ్తాయ్‌(ఉర్దూ), న.పిచమూర్తి(తమిళం), సుదర్శన్‌ (హిందీ), ముల్కరాజ్‌ ఆనంద్‌ ... వంటి ప్రసిద్ధ రచయితల కథలున్నాయి. కథలతో పాటూ, ఆయా రచయితల పరిచయాలు ఇవ్వడం వల్ల ఆ భాషా సాహిత్యం గురించి మరింత తెలుసుకున్నట్లయ్యింది. ఈ కథలన్నీ చదివాక భాష ఏదైనా మానవ జీవితాల్లో సంఘర్షణ ఒకటేనని, సమాజంతో సంబంధం లేకుండా కథలుండవని అర్థమవుతుంది.  
- చందు తులసి

భారతీయ కథా భారతి (అనువాద కథలు)
అనువాదం - కాకాని చక్రపాణి
పేజీలు : 800 వెల : 400
ప్రతులకు: 040 - 2326 4028