ప్రచురణరంగంలో అపార అనుభవం గలవారు పి.రాజేశ్వరరావు. ఆయన సంపాదకత్వంలో సంకలనం, అనువాదం చేసిన మూడు పుస్తకాలు తాజాగా వెలువడ్డాయి..

ఇప్పుడు ప్రైవేటురంగ ఉద్యోగాల్లో రాణించాలంటే విజయం ఎంత ముఖ్యమో మంచి వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం. అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించేందుకు మహానుభావులు చెప్పిన 2700 సూక్తుల సంకలనమే ‘మహానుభావుల మంచి మాటలు’.

పిల్లలు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడు గుతూ ఉంటారు. ఆకాశం నీలంగా ఎందు కుంటుంది? ఆవిరి అంటే ఏమిటి? మంచు ఎలా ఏర్పడుతుంది?....ఇలా వారడిగే ప్రశ్న లకు తికమక పడకుండా పెద్దలకు ఉప యోగపడే పుస్తకం 400 ప్రశ్నలు -సమాధానాలతో కూడిన ‘ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా?’.

అదేవిధంగా ప్రమాదాల్లో ప్రాథమిక చికిత్సచేసే పద్ధతుల్ని తెలియ జేసే మరోపుస్తకం ఇళ్ళు, హాస్పిటల్స్‌, పరి శ్రమలు, నర్సులు, కాంపౌండర్లకు నిత్యం ఎంతో ఉపయోగపడుతుంది.

కాగా మరో పుస్తకం ‘మానవుడి కథ’ ఆదిమ మానవుడి కాలం నుండి ఆధునిక మానవుడి కాలం వరకు జరిగిన పరిణామ క్రమాన్ని అద్భుతమైన కథగా చెప్పిన పుస్తకం ఇది.

 

2700 మహానుభావుల మంచి మాటలు
సంకలనం, సంపాదకులు: పి.రాజేశ్వరరావు
ధర: 90 రూపాయలు
పేజీలు: 124
 
ఎందుకు? ఏమిటి? ఏది? ఎలా?
400 జి.కె.ప్రశ్నలు, సమాధానాలు
సంకలనం, సంపాదకులు: పి.రాజేశ్వరరావు
ధర: 120  రూపాయలు
పేజీలు:138
 
 
నిత్య జీవితంలో ప్రమాదాలకు ప్రథమ చికిత్స
వి.వి.యుదెనిచ్‌
అనువాదం, సంపాదకులు: పి.రాజేశ్వరరావు
ధర: 50  రూపాయలు
పేజీలు:64
 
 
మానవుడి కథ
ఎమ్‌.ఇల్యీన్‌, వై.సెగాల్‌
ధర: 160  రూపాయలు
పేజీలు: 200