విశాఖ రచయితల సంఘాన్ని రాకెట్‌ ఇంధనంతో నింపి నడిపిస్తున్న కార్యదక్షులు రచయిత అడపా రామకృష్ణ, ఈ కృషిలో అంగర సూర్యారావు, కృష్ణారావుగారిలాంటి అనుభవజ్ఞులు ఆయనకు తోడుగా నిలవడంతో ఈ ఏడాదిలోనే ‘విశాఖ కథా తరంగాలు’ పేరిట రెండు సంకలనాలను వెలువరించి కళింగాంధ్ర రచయితల సత్తా నిరూపించారు. నిర్మాణాత్మకమైన రచనల ద్వారా ప్రస్తుత సమాజానికి అభ్యుదయ సాహిత్య విలువలను అందించడమే విశాఖ రచయితల సంఘం లక్ష్యం. అందులో భాగంగానే ఒక విలువైన చారిత్రాత్మక కథా సాహిత్యం అందించేందుకు చేసిన ప్రయత్నంలో నలభై కథలు సేకరించారు. తొలివిడత ఇరవై కథలను మూడునెలల క్రితం మొదటి సంపుటంగా వెలువరించారు. ఇప్పుడు మరో 22 కథలతో రెండో సంపుటం వెలువరించారు. ‘రక్కసి బలుపు ఆగడం’ శీర్షికన కథా సామ్రాట్టు కాళీపట్నం రామారావుగారి కవితను ఆరంభపేజీల్లోనే ప్రచురించి తమ దిశాగమనాన్ని చెప్పకనే చెప్పిందీ రచయితల సంఘం.ఇందులోని రచయితలందరూ లోకాన్ని ఔపోసన పట్టినవారే. ఈ కథలన్నీ హృదయాలను కదిలించేవే.

 

కథా సంకలనం: అడపా రామకృష్ణ

ధర: 100 రూపాయలు

పేజీలు: 200

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు

 

విశాఖ కథా తరంగాలు( సంచిక-1) పుస్తక సమీక్ష..